Akula lalitha biography
ఆకుల లలిత
ఆకుల లలిత తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచింది. ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయింది.[1] ఆకుల లలిత 2021 డిసెంబరు 17న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితురాలై, [2] 2021 డిసెంబరు 24న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]ఆకుల లలిత 1965 డిసెంబరు 08లో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండలం, మాణిక్ భండార్ గ్రామంలో హన్మంతు, సుగుణ దంపతులకు జన్మించింది.
Raja sabri khan biography definitionఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేసింది.
రాజకీయ జీవితం
[మార్చు]ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటిసిగా గెలిచి 2003లో ఎంపీపీగా ఎన్నికయింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీ సభ్యురాలిగా, నిజామాబాదు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా (2005 నుండి 2013) వరకు ఎనిమిది సంవత్సరాలు పనిచేసి, నిజామాబాదు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో పనిచేసింది.
ఆమె 2005లో జెడ్పిటిసిగా పనిచేసింది. ఆకుల లలిత 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో డిచ్‌పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచింది.[3]
ఆకుల లలిత 2015లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయింది. ఆమె ఎమ్మెల్సీగా 2015 జూన్ 4 - 2021 జూన్ 3వరకు పనిచేసింది.[4] ఆకుల లలిత 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యింది.[5] ఆమె 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.[6][7] ఆమె 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యురాలిగా ఉంది.[8]
ఆకుల లలిత 2021 డిసెంబరు 17న తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితురాలై, [9][10] 2021 డిసెంబరు 24న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టింది.[11] 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆమె టికెట్ దక్కకపోవడంతో అక్టోబరు 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది.[12][13] ఆకుల లలిత 2023 అక్టోబరు 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[14][15]